: అమెరికాకు ఏపీ సీఎస్ ఐవైఆర్...నవ్యాంధ్రకు సహకరించాలని ప్రవాసాంధ్రులను కోరతారట!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నిన్న అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. నేటి నుంచి ఈ నెల 16 దాకా అమెరికాలో జరగనున్న ప్రవాస భారతీయ దివస్ లో పాల్గొనేందుకే ఆయన ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక లోటులో కూరుకుపోయిన నవ్యాంధ్రప్రదేశ్ కు ఎప్పటికప్పుడు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే తప్పించి రాష్ట్రం ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు. ఇందుకోసం ప్రవాసాంధ్రులు తమ వంతు సహకారం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సందేశాన్ని ప్రవాసాంధ్రులకు చేరవేయడమే లక్ష్యంగా ఐవైఆర్ ఈ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News