: రెండ్రోజుల పాటు తిరుపతిలో చంద్రబాబు...పార్టీకి ‘దిశా-నిర్దేశం’ చేయనున్న టీడీపీ అధినేత


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి నుంచి రెండ్రోజుల పాటు చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఉండనున్నారు. నేటి నుంచి తిరుపతిలో ‘దిశా-నిర్దేశం’ పేరిట పార్టీ ఏపీ శాఖ రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది. పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా కీలక ప్రసంగాలు చేయనున్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆయా నేతలపై ఇప్పటికే సర్వే చేయించిన చంద్రబాబు, పనితీరు బాగా లేని నేతలకు క్లాసులు పీకనున్నారట. అంతేకాక పార్టీలో పాత కాపులు, కొత్త నేతల మధ్య నెలకొన్న దూరాన్ని తొలగించేందుకు కూడా చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇక ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై పార్టీ తరఫున ప్రచారం చేసే అంశాన్ని కూడా చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News