: అది మీ గొప్పదనం...ఇది మా ఉదారత: బ్రిటిష్ పార్లమెంటులో మోదీ


భారత్-బ్రిటన్ మధ్య సన్నిహిత సంబంధాలకు కారణాలు ప్రపంచం మొత్తానికి తెలుసని ప్రధాని మోదీ తెలిపారు. బ్రిటిష్ పార్లమెంటునుద్దేశించి ఆయన మాట్లాడుతూ, బ్రిటన్, భారత్ మధ్య సారూప్యత గురించి చెప్పాలంటే ప్రధానంగా బ్రిటన్ పార్లమెంటు బయట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం గురించి మాట్లాడాలని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం చేసిన మహాత్మాగాంధీ గొప్పతనాన్ని బ్రిటిష్ పార్లమెంటు గుర్తించి గొప్పతనం చాటుకుంటే, మమ్మల్ని పాలించారనే కసి లేకుండా బ్రిటన్ తో సన్నిహిత సంబంధాలు నెరిపే సహృదయత భారతీయుల సొంతమని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్, ఇతర కీలక రంగాల్లో రెండు దేశాలు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. భారత స్వాతంత్ర్యంలో ప్రధాన పాత్ర పోషించిన ఎంతో మంది ఇంగ్లండ్ లో చదువుకుంటే, స్వాతంత్ర్యానంతరం మరింత మంది చదువుకున్నారని ఆయన చెప్పారు. రెండు దేశాలు పరస్పర సహకారంతో సంబంధాలు నెరపుకోవాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ ఆంబేద్కర్ ఉద్బోధించిన శాంతి, సామరస్యం, సమానత్వం, వివక్ష నుంచి మేలుమలుపు వంటి ఎన్నో అంశాలను ప్రపంచానికి తెలిసేలా చేయాలని ఆయన చెప్పారు. ప్రధాని ప్రసంగం తరువాత బ్రిటిష్ పార్లమెంటు చప్పట్లతో మార్మోగిపోయింది.

  • Loading...

More Telugu News