: ఆ సినిమాల్లో నటిస్తా...చూడను: జేమ్స్ బాండ్ పాత్రధారి డేనియల్ క్రెగ్
జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ఆదరణ లభిస్తుంది. అయితే ఆ పాత్రల్లో నటించే డేనియల్ క్రెగ్ మాటలు విని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే రూపుదిద్దుకున్న జేమ్స్ బాండ్ 24వ సినిమా 'స్పెక్టర్'ను బ్రిటన్ రాజకుటుంబం, ఇతర ప్రముఖుల కోసం రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రివ్యూ వేశారు. ఈ సందర్భంగా జేమ్స్ బాండ్ పాత్రధారి డేనియల్ క్రెగ్ మాట్లాడుతూ, జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించడం వరకు బాగుంటుందని అన్నాడు. ఆ సినిమాలను తాను పెద్దగా చూడనని తెలిపాడు. దీంతో తెల్లబోవడం అక్కడున్నవారి వంతైంది. ఇదిలా ఉంటే జేమ్స్ బాండ్ ను సినిమాల్లో బ్రిటన్ ఇంటెలిజెన్స్ శాఖ ఎమ్ఐ6 లో పని చేస్తున్నట్టు చూపిస్తారు. ఇప్పుడా శాఖ రిక్రూట్ మెంట్ మొదలుపెట్టింది. అయితే ఆ రిక్రూట్ మెంట్ లో జేమ్స్ బాండ్ లా సింగిల్ గా వెళ్లి పని ఫినిష్ చేసుకుని వచ్చే వారికంటే, చాకచక్యంగా అందరినీ కలుపుకుంటూపోతూ పని చక్కబెట్టేవారిని తీసుకోనున్నట్టు సమాచారం.