: సకలజనుల సమ్మె కాలం సాధారణ సెలవుగా మార్పు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం గతంలో ఉద్యోగులు చేపట్టిన సకల జనుల సమ్మె కాలాన్ని సాధారణ సెలవుగా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. దానికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. త్వరలో జీవో విడుదల చేయనున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 42 రోజుల పాటు ప్రభుత్వోద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఆ సమ్మె కాలాన్ని సాధారణ సెలవుగా మార్చాలని ఎప్పటి నుంచో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఈ విషయంపై హామీ ఇచ్చింది. అదిప్పుడు అమలులోకి రానుంది.