: బందరు కొత్తపాలెంలో ఉద్రిక్తత... అధికారులపై ప్రజల ఆగ్రహం


కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కొత్తపాలెం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేటి ఉదయం అధికారులు 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు అధికారులు గ్రామం చేరుకున్నారు. అధికారులను చూసిన గ్రామస్థులు మండిపడ్డారు. ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, సీపీఐ నేతలపై స్థానికులు మండిపడ్డారు. కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన టెంటును పీకి పారేశారు. కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలను విరగ్గొట్టారు. బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ చట్టంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులను కాసేపు నిర్బంధించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News