: అంగ్ సాన్ సూకీకి మోదీ శభాకాంక్షలు... భారత్ కు రావాలని ఆహ్వానం
మయన్మార్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అంగ్ సాన్ సూకీకి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బ్రిటన్ పర్యటనకు వెళుతున్న సమయంలో ఆమెకు ఫోన్ ద్వారా మోదీ శుభాకాంక్షలు చెప్పారని, భారత్ రావాలని ఆహ్వానించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ లో తెలిపారు. పోయిన వారం జరిగిన మయన్నార్ పార్లమెంట్ ఎన్నికల్లో సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ(ఎన్ఎల్ డీ) 536 సీట్లు గెలుపొందిన సంగతి తెలిసిందే.