: దీపావళి విషాదం...చాక్లెట్ అనుకుని టపాసు మింగేసింది!


దీపావళిలో టపాసుల జిలుగు వెలుగులు తెచ్చే ఆనందం మాటున కొన్ని సంఘటనలు విషాదాన్ని కూడా నింపుతాయి. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా తిసంగి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ఆ ఊళ్లో నిన్న సాయంత్రం దీపావళి సంబరాలు ఇంకా మొదలు కాలేదు. దామిని నికం (5) అనే బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. ఇంతలో ఓ టపాసు వచ్చి ఆమె ముందు పడింది. దానిని చూసిన దామిని అది చాక్లెట్ అనుకుని భ్రమపడి నోట్లో వేసేసుకుంది. అది గమనించిన తల్లి కూతుర్ని వెంటనే ఆసుపత్రికి తరలించింది. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News