: భారత్ జియోమీ ఫోన్లు, ట్యాబ్లెట్లకు బీమా సౌకర్యం... ఇకపై కొనుగోలు చేసే వాటికే!


భారత్ లో విక్రయించే తమ ఫోన్లు, ట్యాబ్లెట్లకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ జియోమీ బీమా సౌకర్యం కల్పించింది. mi.com ద్వారా 'మీ ప్రొటెక్ట్ ప్లాన్' ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. అయితే జియోమీ సంస్థ ఇందులో ఓ మెలికపెట్టింది. ఇప్పటికే కొనుగోలు చేసిన ఫోన్లకు ఈ బీమా సౌకర్యం లభించదని చెప్పింది. ఇక నుంచి కొనుగోలు చేసే ఫోన్లకే బీమా లబ్ధి చేకూరుతుందని తెలిపింది. 'మీ ప్రొటెక్ట్ ప్లాన్' లో బీమా కావాలనుకుంటే ముందుగా స్వల్ప మొత్తంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుందని జియోమీ ఓ ప్రకటనలో తెలిపింది. ఉదాహరణకు... రెడ్మీ2, రెడ్మీ2 ప్రైమ్ ఫోన్లు కొనుగోలు చేసేవారు అదనంగా రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. మీ4 (16జీబీ), మీ4ఐ (16జీబీ), మీ ప్యాడ్ లను కొనుగోలు చేసేవారు వారు రూ.499 అదనంగా చెల్లించాలి.

  • Loading...

More Telugu News