: లండన్ చేరుకున్న ప్రధాని మోదీ


విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ టర్కి నుంచి బయలుదేరి లండన్ చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఇక్కడ మోదీ పర్యటించనున్నారు. ముుందుగా బ్రిటన్ ప్రధాని జేమ్స్ కామెరూన్ ను కలవనున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై బ్రిటన్ ప్రధానితో చర్చిస్తారు. అంతేగాక ఈ పర్యటనలో బ్రిటన్ తో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తరువాత బ్రిటన్ పార్లమెంటులో మోదీ ప్రసంగించనున్నారు. వెంబ్లీ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతేగాక, బ్రిటన్ రాణి ఎలిజబెత్ తన నివాసం బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఏర్పాటుచేసే విందు సమావేశంలో మోదీ పాల్గొంటారు.

  • Loading...

More Telugu News