: పవన్ కల్యాణ్ కు మర్యాదలు అదిరిపోయాయ్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ మధ్యాహ్నం జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ కలిశారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అతిథి మర్యాదలు అదిరిపోయాయి. క్యాంప్ ఆఫీసు వద్ద చంద్రబాబు వాహనం ఉండాల్సిన స్థలంలో పవన్ కల్యాణ్ వాహనాన్ని పార్కింగ్ చేయించారు. భేటీ అనంతరం పవన్ వెళ్లే సమయంలో కూడా, కారు వరకు వచ్చి జనసేనానికి చంద్రబాబు వీడ్కోలు పలికారు. సాధారణంగా చంద్రబాబు నుంచి ఈ స్థాయి ప్రాధాన్యత ఇతరులకు దక్కదు. గత ఎన్నికల నాటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. టీడీపీ అధికారంలోకి రావడంలో పవన్ కల్యాణ్ కృషి చాలా ఉంది. ఈ నేపథ్యంలో, పవన్ కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.