: దీపావళి నాడు భారత ధగధగలు... సెహ్వాగ్ పోస్టు చేసిన చిత్రమిదే!
గత రాత్రి దీపావళి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు బాణసంచా కాలుస్తున్న వేళ, యూఎస్ అంతరిక్ష సంస్థ నాసా భారత చిత్రాలను తీసిందట. రాత్రిపూట విద్యుత్ వెలుగులు, టపాకాయల పేలుళ్ల మధ్య భారత్ ఎంతగా ధగధగలాడుతోందో తెలుపుతూ అద్భుతమైన చిత్రాలను నాసా విడుదల చేసిందంటూ, 'ఇండియా ఎట్ నైట్ డ్యూరింగ్ దివాలీ' క్యాప్షన్ తో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ చిత్రాన్ని తన అభిమానుల కోసం ట్వీట్ చేశాడు. కాగా, ఇది తాజా చిత్రం కాదని, గతంలోనిదని సమాచారం. చిత్రం ఇప్పటిదైనా, పాతదైనా దీపావళి కాంతుల నడుమ ఇలానే ఉండివుంటుంది. ఏమంటారు?