: సీపీఐ నారాయణ ఓటును తొలగించలేదు: జీహెచ్ఎంసీ అధికారులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తన ఓటు తొలగించారని, ఓట్ల తొలగింపులో అక్రమాలు జరుగుతున్నాయనడానికి ఇదే నిదర్శనమంటూ సీపీఐ నారాయణ ఆరోపించడంపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. ఆయన ఓటును తొలగించారన్న వార్తల్లో నిజం లేదని, ఆయన ఓటు అలాగే ఉందని చెప్పారు. నారాయణ ఓటర్ ఐడీకార్డు నంబర్ కేజీవై 4591947గా ఉందని తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయనకు ఓటు ఉందని అధికారులు వివరించారు. ఇటీవల గ్రేటర్ పరిధిలో లక్షల ఓట్లు తొలగించడంపై పలువురు ఫిర్యాదు చేస్తుండటంతో మళ్లీ వాటిని కలుపుతున్నారు.