: సీఎం కేసీఆర్ పాలనపై టి.కాంగ్రెస్ నేతల పుస్తకం


తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పుస్తకం విడుదల చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పుస్తకాన్ని విడుదల చేశారు. కేసీఆర్ దళితులను మోసం చేశారని ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ పాలనపై పుస్తకంలో 50 ప్రశ్నలు సంధించినట్టు చెప్పారు. ఈ పుస్తకాన్ని వరంగల్ ప్రజలకు పంపిణీ చేయనున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News