: ఈ దఫా తగలబెట్టింది తక్కువే... హైదరాబాదులో కాలుష్యమూ తగ్గిందట!


గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడు దీపావళి తరువాత గాలిలో కాలుష్య కారకాలు తక్కువగా చేరాయని కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. గాలిలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయి పెరగలేదని పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) అధికారి రవీందర్ వెల్లడించారు. ఇదే సమయంలో సల్ఫర్ డయాక్సైడ్ 50 శాతం, నైట్రస్ ఆక్సైడ్ 70 శాతం పెరిగాయని తెలిపారు. కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెరిగిందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ధరల పెరుగుదల కూడా పటాసుల విక్రయాలపై ప్రభావం చూపిందని, అందువల్లే తక్కువగా కొనుగోలు చేసిన ప్రజలు, తక్కువ కాల్చినట్లయిందని తెలుస్తోంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం తదితర జిల్లాల్లోని చాలా చోట్ల దీపావళి పటాసుల అమ్మకాలు ఏమాత్రమూ సాగలేదు. దీపావళి నాడు సైతం పలు చోట్ల వర్షాలు పడటంతో, చాలా మంది టపాకాయలకు దూరంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News