: ఓరుగల్లులోనూ బీహార్ ఫలితం రిపీట్... జైపాల్ రెడ్డి కామెంట్


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆసక్తికర కామెంట్లు చేశారు. వరంగల్ పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బీహార్ ఫలితం రిపీటవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల ప్రచారం కోసం వరంగల్ కు వెళ్లిన సందర్భంగా అక్కడ జరిగిన సభలో ఆయన పార్టీ నేతలతో కలిసి ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావించారు. బీహార్ లో బీజేపీకి తగిలిన ఎధురుదెబ్బ మాదిరే వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు కూడా ప్రజలు బుద్ధి చెప్పనున్నారని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విజయం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News