: పవన్ కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో ఆంతరంగిక చర్చలు జరిపేందుకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చిన వేళ, ఆయన ప్రయాణిస్తున్న కారులో స్వల్ప ప్రమాదం సంభవించింది. గన్నవరం నుంచి కాన్వాయ్ సీఎం కార్యాలయానికి వెళుతుండగా, రమేష్ అసుపత్రి సమీపంలో కాన్వాయ్ పైలట్ వాహనాన్ని మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు అయిన సమాచారం వెలువడలేదు. ప్రమాదం అనంతరం కాన్వాయ్ సీఎం ఆఫీస్ వైపు సాగిపోయింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి వుంది.