: రాజ్యసభ మాజీ సభ్యుడు ఆత్మహత్య
రాజ్యసభ మాజీ సభ్యుడు ఎన్.రాజేంద్రన్ (62) తన కారులో ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులోని కోవిల్ పట్టిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. కోవిల్ పట్టి బస్టాండ్ కు సమీపంలో ఉన్న జాతీయ రహదారి పక్కన కారును పార్క్ చేసి ఈ అఘాయిత్యానికి ఆయన పాల్పడ్డారు. ఘటనా స్థలం ఆయన నివాసానికి దగ్గర్లోనే ఉంది. ఆయన శరీరంపై బుల్లెట్ గాయాలున్నాయి. ఆయన మృతదేహం పక్కన రివాల్వర్ కూడా ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. 1996లో రాజేంద్రన్ ను ఏఐఏడీఎంకే రాజ్యసభకు నామినేట్ చేసింది. అనంతరం 2000లో ఆయన డీఎంకే పార్టీలోకి మారారు. ప్రస్తుతం ఆయన హోటల్, ట్రాన్స్ పోర్ట్ లాంటి పలు బిజినెస్ లు నిర్వహిస్తున్నారు.