: సన్నిహితులకు మహేశ్ బాబు దీపావళి కానుకలు


దీపావళి సంతోషాన్ని సినీ నటుడు మహేశ్ బాబు తన మిత్రులతో కూడా పంచుకున్నాడు. సినీ పరిశ్రమలోని తనకు అత్యంత సన్నిహితులైన కొంతమంది మిత్రులకు పండుగ సందర్భంగా పండ్లు, స్వీట్స్ తో గిఫ్టులను పంపించాడు. అలా మహేశ్ నుంచి దర్శకుడు క్రిష్ కూడా దీపావళి బహుమతిని అందుకున్నాడు. ఈ విషయాన్ని క్రిష్ తన ట్విట్టర్ పోస్ట్ చేశాడు. అంతేకాదు, మహేశ్ పంపిన గిఫ్టును ఫోటో తీసి పెట్టాడు. అందులో స్వీట్స్, ఆర్గానిక్ మామిడి పండ్లు, డ్రై ఫ్రూట్స్, వాటితో పాటు మహేశ్ స్వయంగా రాసిన పండుగ శుభాకాంక్షల పత్రం కూడా ఉంది. ఇందుకు క్రిష్ కూడా తిరిగి మహేశ్, నమత్రలకు కృతజ్ఞతలు తెలిపి, పండుగ శుభాకాంక్షలు చెప్పాడు.

  • Loading...

More Telugu News