: చంద్రబాబును పవన్ కలవడం వెనుక ఉద్దేశం ఏంటి?: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల
ఏపీ సీఎం చంద్రబాబును నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ కలయిక వెనక ఉద్దేశం ఏంటని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ప్రశ్నించారు. రైతుల తరపున పోరాటం చేయడానికి వెళ్లారా? లేక చంద్రబాబుతో రాజీపడేందుకు వెళ్లారా? అనే విషయాన్ని పవన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన పవన్ కు ఆ విషయం గుర్తుందా? లేదా? అని ఆర్కే సూటిగా అడిగారు.