: పవన్ కల్యాణ్ కు చంద్రబాబు స్వాగతం... సీఎం క్యాంపు ఆఫీస్ లో భేటీ ప్రారంభం
తనతో భేటీ కోసం హైదరాబాదు నుంచి విజయవాడ వచ్చిన జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సాదరంగా స్వాగతం పలికారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అంతకుముందే తన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు అక్కడికి వచ్చిన పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. వెనువెంటనే వారిద్దరూ చర్చల్లో మునిగిపోయారు. పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ దాదాపు రెండు గంటలకు పైగా సాగే అవకాశాలున్నట్లు సమాచారం.