: మరింత పెరిగిన ఆస్ట్రేలియన్ల సగటు ఆయుష్షు
ప్రపంచ దేశాల్లోనే అన్ని దేశాల ప్రజల కన్నా ఎక్కువ ఆయుర్దాయాన్ని ఆస్ట్రేలియన్లు ఇప్పటికే కలిగి ఉన్నారు. అయితే వారి ఆయుర్దాయం ఈసారి మరింత పెరిగింది. దానికి సంబంధించి 'ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్' తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం ఆస్ట్రేలియాలోని స్త్రీ, పురుషుల సగటు జీవిత కాలం రికార్డు స్థాయిలో పెరిగిందని తెలిపింది. 2013 లెక్కల ప్రకారం ఒక ఆస్ట్రేలియా పురుషుడి సగటు జీవితకాలం 80 సంవత్సరాల ఒక నెల ఉంది. తాజాగా అది 80 సంవత్సరాల మూడు నెలలకు పెరిగింది. ఇక మహిళల ఆయుష్షు మాత్రం 84 సంవత్సరాల నాలుగు నెలలకు పెరిగిందని వెల్లడించింది. ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో జపాన్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఐస్ లాండ్, ఇజ్రాయెల్, స్వీడన్ దేశాల్లో మాత్రమే స్త్రీ, పురుషులు 80 ఏళ్ల సగటు జీవన ప్రమాణ రేటును కలిగి ఉన్నారు.