: బాడీగార్డ్ కుమారుడిని వెండితెరకు పరిచయం చేస్తున్న సల్మాన్


యువ టాలెంట్ ను వెండితెరకు పరిచయం చేయడంలో బాలీవుడ్ లో నటుడు సల్మాన్ ఖాన్ ముందుంటాడు. ఇప్పటికే పలువురిని తన సినిమాల ద్వారా కథానాయికలుగా పరిచయం చేశాడు. ఈ మధ్యే నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, మరో నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలిలను 'హీరో' చిత్రం ద్వారా నాయికా, నాయకులుగా పరిచయం చేశాడు. ఈసారి కూడా ఓ యువకుడిని నటుడిగా తీసుకొస్తున్నాడు. అయితే ఈ కుర్రాడు ఏ సీనియర్ నటుల కుమారుడో అనుకుంటే పొరపాటే. కొంతకాలం నుంచి తన దగ్గర బాడీగార్డ్ గా పనిచేస్తున్న షేరా కుమారుడు టైగర్ ను తన నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చేస్తున్నాడు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. 22 ఏళ్ల టైగర్ కు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.

  • Loading...

More Telugu News