: సచిన్ బ్లాస్టర్స్ కు వరుస ఓటమి... ‘ఆల్ స్టార్స్’ ట్రోఫీ ‘వారియర్స్’ కైవసం!


ఆల్ స్టార్ క్రికెట్ టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలోని సచిన్ బ్లాస్టర్స్ జట్టుకు వరుసగా రెండో ఓటమి తప్పలేదు. అమెరికా గడ్డపై మేటి క్రికెటర్లంతా కలిసి రెండు జట్లుగా విడిపోయి ఆల్ స్టార్ టోర్నీకి శ్రీకారం చుట్టారు. ఆసీస్ మేటి స్పిన్నర్ షేన్ వార్న్ నేతృత్వంలో వార్న్ వారియర్స్, సచిన్ నేతృత్వంలో సచిన్ బ్లాస్టర్స్ జట్టు బరిలోకి దిగాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే జరిగిన ఓ టీ20 మ్యాచ్ లో వార్న్ వారియర్స్ జట్టు సచిన్ బ్లాస్టర్స్ ను చిత్తు చేసింది. తాజాగా కొద్దిసేపటి క్రితం హూస్టన్ లో ముగిసిన మ్యాచ్ లోనూ వారియర్స్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 262 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బ్లాస్టర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్లాస్టర్స్ ఓపెనర్లు సెహ్వాగ్, గంగూలీలు స్వల్ప స్కోరుకే ఔటవడంతో మిగిలిన బ్యాట్స్ మెన్ కూడా పెద్దగా రాణించలేకపోయారు. వరుసగా రెండో విజయంతో మూడు టీ20ల సిరీస్ లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే వారియర్స్ జట్టు ఆల్ స్టార్ టోర్నీ ట్రోఫీని కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News