: నిర్మలా సీతారామన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. ఆమె ఖాతాలో @CimGOI ట్యాగ్ తో పదే పదే అనవసర సమాచారం పోస్ట్ అవుతూ ఉంది. ఒక కంపెనీ ప్రచారానికి సంబంధించిన సమాచారం అప్ లోడ్ అవుతోంది. దీంతో, ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని ఆమె ఫాలోయర్లు గుర్తించారు. ఇదే విషయాన్ని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో, తన అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించి, తెలియజేసినందుకు తన ఫాలోయర్లకు నిర్మల థ్యాంక్స్ చెప్పారు. అంతేకాకుండా, హ్యాక్ చేసింది ఎవరు? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.