: లక్కున్న చిన్నారులకు ఎయిర్ ఇండియా ఉచిత టికెట్లు
ఈ బాలల దినోత్సవం సందర్భంగా 12 సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులకు ఉచితంగా విమాన ప్రయాణాన్ని దగ్గర చేయనున్నట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. నవంబర్ 14న వీరు ప్రయాణం చేయవచ్చని, లక్కీ డ్రా ద్వారా ఉచిత టికెట్లను పంచుతామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. తొలి బహుమతిగా ఢిల్లీ- శాన్ ఫ్రాన్సిస్కో - ఢిల్లీ మధ్య విమాన ప్రయాణాన్ని, రెండవ బహుమతిగా నలుగురికి దేశవాళీ సర్వీసుల్లో వారు కోరుకున్న చోట్లకు వెళ్లి రావడానికి, మూడవ బహుమతిగా ఎకానమీ టికెట్లను ఉచితంగా అప్ గ్రేడ్ చేసి, వారిని బిజినెస్ క్లాస్ ప్రయాణానికి అనుమతిస్తామని తెలిపింది.