: పాకిస్థాన్ లోని హిందువులకు నవాజ్ షరీఫ్ భరోసా


పాకిస్థాన్ లో మైనారిటీలుగా పలు ఇబ్బందులు అనుభవిస్తున్న హిందూ మతస్తులకు భరోసాగా నిలుస్తానని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. వారికి అన్యాయం జరిగితే తాను చర్యలు తీసుకుంటానని అన్నారు. దీపావళి సందర్భంగా కరాచీలోని ఓ హోటల్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన, "ఓ హిందువు ఇబ్బంది పడినప్పుడు, ఇబ్బంది పెట్టిన వ్యక్తి ముస్లిం అయితే, ఆ ముస్లింపై చర్యలు తప్పవు. నేను హిందువుల వైపే ఉంటాను" అని అన్నారు. కాగా, పాక్ లో మైనారిటీల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ నవాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కుల, మత, వర్గాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ న్యాయం చేయడం తన విధిగా ఆయన పేర్కొన్నారు. బలహీనుల వైపు నిలవాలని తన మతం చెబుతోందని, ప్రతి మతమూ చెప్పేది అదేనని తెలిపారు. పాకిస్థాన్ లో హిందూ, ముస్లింలు కలసి వుంటున్నారని, సంతోషాన్ని కలసి పంచుకుంటున్నారని వివరించారు.

  • Loading...

More Telugu News