: నిద్రలో నడిచేవారికి దెబ్బ తగిలినా నొప్పి ఉండదట!


సాధారణంగా ఏ చిన్న దెబ్బ తగిలినా కాసేపు శరీరం విలవిల్లాడుతుంటుంది. అయితే, నిద్రలో నడిచే అలవాటున్న వారికి మాత్రం అలా నడిచేటప్పుడు ఏం జరిగినా నొప్పి తెలియదని లండన్ పరిశోధకులు వెల్లడించారు. నిద్రలో నడిచేవారిపై ఓ అధ్యయనం చేయగా, వీరు భవనంపై నుంచి పడినా, కాలు విరిగినా అప్పటికప్పుడు నొప్పి తెలియదని, నిద్ర నుంచి లేచిన తరువాత మాత్రమే గాయం వల్ల కలిగిన బాధ తెలుస్తుందని వివరించారు. ఈ సర్వేలో 55 మంది పురుషులు, 45 మంది స్త్రీలు పాల్గొనగా, నిద్రలో తాము నడిచినప్పుడు ఎక్కడో ఒక చోట గాయం అయిందని, దాని గురించి తాము ఆ తరువాతనే తెలుసుకున్నామని తెలిపారు. కొందరికి తీవ్ర గాయాలు అయినప్పటికీ, నొప్పి తెలియలేదట.

  • Loading...

More Telugu News