: పాకిస్థాన్ లో ఆడనున్న సచిన్ టెండూల్కర్!
ఓ పక్క పాకిస్థాన్ తో క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ ససేమిరా అంటున్న వేళ, ఆల్ స్టార్ టీ-20 మ్యాచ్ ని ఆ దేశంలో నిర్వహించేందుకు సచిన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆల్ స్టార్ టీంలలో పాక్ కు చెందిన షోయబ్ అక్తర్, వసీం అక్రమ్, సక్లెయిన్ ముస్తాక్, మోయిన్ ఖాన్ తదితరులు ఉన్న సంగతి తెలిసిందే. పాక్ లో మ్యాచ్ ఆడాలని షోయబ్ కోరాడట. దానికి సచిన్ అంగీకరించాడని, ఇక వేదిక, తేదీల ఖరారు మాత్రమే మిగిలివుందని అక్తర్ స్వయంగా వివరించాడు. కాగా, రెండవ ఆల్ స్టార్ టీ-20 నేడు హ్యూస్టన్ లో జరగనున్న సంగతి తెలిసిందే.