: దేశానికి గౌరవం మీ చలవే!...అమృత్ సర్ లో సైనికులతో మోదీ దీపావళి సంబరాలు


దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నిన్న ప్రధాని నరేంద్ర మోదీ అమృత్ సర్ లోని దోగ్రాయ్ వార్ మెమోరియల్ ను సందర్శించారు. అక్కడే ఆయన సైనికులతో కలిసి దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సైనికుల్లో ఉత్సాహం నింపేలా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’పై మాజీ సైనికులు చేసిన నిరసన ప్రదర్శనలపై ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశారు. భారత్ పట్ల ప్రపంచ దేశాలు గౌరవంతో చూస్తున్నాయంటే, అది సైనికుల వల్లేనని మోదీ వ్యాఖ్యానించారు. సైన్యంతో కలిసి దీపావళి వేడుకలు చేసుకునే అవకాశం రావడం సంతోషంగా ఉందని కూడా మోదీ అన్నారు. ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన మోదీ, ట్విట్టర్ లో సైనికులతో తన దీపావళి సంబరాల అనుభవాలను పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News