: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ నేడే... విజయవాడ వేదికగా కీలక సమావేశం


జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ నిన్న మధ్యాహ్నమే చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరారు. ఆయన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎంఓ అధికారులు నేటి మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబుతో భేటీకి అపాయింట్ మెంట్ ఖరారు చేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం విజయవాడ చేరుకోనున్న పవన్ కల్యాణ్ అక్కడి సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అవుతారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కావాల్సిన భూసేకరణ, రైతులకు ప్రభుత్వం ఇవ్వనున్న పరిహారం, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం. ఈ భేటీపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News