: భార్య,పిల్లలు వుండగా రెండో వివాహానికి రెడీ అయ్యాడు... పోలీసులకు దొరికిపోయాడు!
భార్య బోర్ కొట్టిందని రెండో వివాహానికి ప్రయత్నించాడో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. తాను ఉద్యోగంలో చేరడానికి ముందే ఈ కుర్రాడు హన్మకొండలో ఓ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య బోర్ కొట్టిందని, ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం కుదుర్చుకున్నాడు. ఈ నెల 18న వివాహం తేదీ కూడా నిశ్చయించారు. యువతి కుటుంబ సభ్యులు బంధువులకు కార్డులు పంచేందుకు హన్మకొండ చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో రాజ్ కుమార్ కు వివాహం జరిగి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్న సంగతి వారికి తెలిసింది. దీంతో వారు చాకచక్యంగా వ్యవహరించి ఆ ప్రబుద్ధుడిని పోలీసులకు పట్టించారు.