: సంక్రాంతికి బాబాయ్ తో అబ్బాయి ఢీ... బాక్సాఫీసు వార్!


టాలీవుడ్ లో బాబాయ్- అబ్బాయ్ మధ్య బాక్సాఫీసు యుద్ధం తప్పదని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'డిక్టేటర్' సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దర్శకుడు శ్రీవాస్ సన్నాహాలు చేస్తుండగా... నందమూరి వంశానికి చెందిన మరో హీరో జూనియర్ ఎన్డీఆర్ నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో' సినిమా కూడా సంక్రాంతికి అభిమానుల ముందుకు రానుంది. ఈ మేరకు దీపావళి కానుకగా జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసిన పోస్టర్ లో సంక్రాంతి రిలీజ్ అని పేర్కొన్నారు. అంటే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అదే సమయంలో సంక్రాంతికి తన సినిమాను విడుదల చేయడం బాలకృష్ణ సెంటిమెంట్. పండగ సమయం కలిసి వస్తుందని భావించే బాలయ్య తన సినిమాను సంక్రాంతికి అభిమానుల ముందుకు తెచ్చేందుకు ఇష్టపడతాడు. వీరిద్దరి సినిమాలు సంక్రాంతికి విడుదల కానుండడంతో ఎవరి సినిమా ఆదరణపొందుతుందో అని అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News