: దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు
దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఏడాదికేడాది దీపావళి బాణసంచా రేట్లు పెరుగుతున్నాయి. అయినా సరే, దీపావళి ఉత్సవాల్లో ఎలాంటి మార్పు రాకపోవడం విశేషం. దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇంటింటా దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి సందడి చేస్తున్నారు. ఇదే సమయంలో కాలుష్యంపై అవగాహన పెరగడంతో ఎకో ఫ్రెండ్లీ దీపావళి నిర్వహించేందుకు కొంత మంది ఉత్సాహం చూపారు. ఇలాంటి యువత మొత్తం కేవలం దీపాలు మాత్రమే వెలిగించి, చిచ్చుబుడ్లు, మతాబులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. విపరీతమైన శబ్దాన్ని వెలువరించే బాంబులకు దూరంగా ఉన్నారు.