: రెండో మ్యాచ్ లో అలరించనున్న గంగూలీ, మెక్ గ్రాత్


అమెరికాను అలరిస్తున్న క్రికెట్ ఆల్ స్టార్స్ టోర్నీ రెండో మ్యాచ్ కు సౌరవ్ గంగూలీ, గ్లెన్ మెక్ గ్రాత్ ప్రధానాకర్షణగా మారనున్నారు. హూస్టన్ వేదికగా రేపు తెల్లవారుజామున 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ లో గంగూలీ, మెక్ గ్రాత్, ఆగార్కర్ ఆడనున్నారు. తొలి మ్యాచ్ లో సెహ్వాగ్, సచిన్, కలిస్, సంగక్కర, పాంటింగ్, జాంటీ రోడ్స్ మెరుపులు మెరిపించగా... షోయబ్ అఖ్తర్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ రాణించి సత్తాచాటారు. తొలి మ్యాచ్ లో వార్న్ వారియర్స్ తో ఓడిన సచిన్ బ్లాస్టర్స్ రెండో మ్యాచ్ లో విజయం సాధించాలని గట్టిపట్టుదలతో ఉంది. కాగా, అమెరికాలో క్రికెట్ కు ఆదరణ లభిస్తుందా? అని పెదవి విరిచిన వారి సందేహాలను పటాపంచలు చేస్తూ, అన్ని దేశాల క్రీడాభిమానులు స్టేడియానికి రావడం విశేషం. తమ దేశానికి సంబంధించిన ఆటగాళ్లు మైదానంలోకి ఎంటర్ అవ్వగానే వారు నినాదాలతో హోరెత్తించారు.

  • Loading...

More Telugu News