: ప్చ్...దీపావళి మిస్సయ్యా: మార్క్ జుకెర్ బర్గ్
ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ కు భారతదేశం మీద ఎక్కడ లేని ప్రేమ పొంగిపోతోంది. ఈ మధ్య ఫేస్ బుక్ పేజ్ లో భారత్ లోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని ప్రస్తావిస్తూ తన ఆపేక్ష చాటుకుంటున్నారు. తాజాగా భారత్ లో దీపావళి మిస్సయ్యానని జుకెర్ బర్గ్ పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం మిస్సయ్యానని జుకెర్ బర్గ్ అన్నారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పి, ఆమధ్య గోవాలో ఓ మిత్రుడి వివాహానికి హాజరైన ఫోటోను ఆయన పోస్టు చేశారు.