: వారు జీవితం త్యాగం చేశారు...వారికా హక్కు ఉంది: సుబ్రహ్మణ్యస్వామి


బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, శాంతకుమార్ వంటి నేతలు పార్టీ కోసం తమ జీవితం త్యాగం చేశారని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పార్టీలో ఏ విషయంపైనైనా చర్చించే అధికారం అద్వానీకి ఉందని అన్నారు. బీహార్ ఓటమిపై చర్చ జరగాలని ఆయన స్పష్టం చేశారు. జన్ సంఘ్ ఆవిర్భావం నుంచి వారు పార్టీలో ఉన్నారని, వారి కనుసన్నల్లోనే బీజేపీ పార్టీగా రూపుదిద్దిందని, వారి త్యాగాల ఫలితమే ప్రస్తుత బీజేపీ అని ఆయన స్పష్టం చేశారు. వారు చర్చ జరగాలని అనడంలో న్యాయముందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ విజయం సాధించినప్పుడు అంతా మోదీ ఘనత అన్నప్పుడు ఓటమిని పార్టీకి ఎలా ఆపాదిస్తారని ఆయన నిలదీశారు. విజయానికైనా ఓటమికైనా బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News