: సముద్రంలో చర్చ్... రష్యా అద్భుత సృష్టి!
సముద్రంలో ఓ చర్చ్ ని నిర్మించేందుకు రష్యా సన్నాహాలు చేస్తోంది. క్రిమియా సముద్ర తీరంలో 200 మీటర్ల లోపల ఈ చర్చ్ నిర్మాణం చేపట్టనున్నట్టు రష్యా తెలిపింది. సముద్రంలో డైవర్లు ఇప్పటికే లంగరు ఆకారంలో ఉన్న శిలువకు శంకుస్థాపన చేశారు. ఈ చర్చ్ నిర్మాణానికి అయ్యే ఖర్చును రష్యన్ సైకిల్ మోటార్ క్లబ్, మాస్కోలో ప్రసిద్ధిగాంచిన ఓ చర్చ్ భరించనున్నాయి. ఈ చర్చ్ పూర్తయితే పర్యాటకులు పెరుగుతారని పర్యాటక శాఖ ప్రతినిధులు పేర్కొంటున్నారు. భూమిమీద ఉండే చర్చ్ లాగే ఈ చర్చ్ కూడా ఉంటుందని, దీని నిర్మాణంలో స్టెయిన్ లెస్ స్టీల్ లేదా స్టోన్ ఉపయోగిస్తామని వారు వెల్లడించారు. ఈ మేరకు ఆర్కిటెక్ట్ లు డిజైన్ పై దృష్టి పెట్టారని వారు వెల్లడించారు.