: మనం చేసే ప్రతి చర్యకీ ప్రతి చర్య ఉంటుంది: బీజేపీ ఓటమిపై నితీశ్ కుమార్
బీహార్ లో బీజేపీ ఓటమిపై విశ్లేషణలు ఇప్పట్లో చల్లారేలా లేవు. బీజేపీ ఓటమిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆ పార్టీపై విజయం సాధించి ముఖ్యమంత్రిగా మరోసారి పదవి చేబట్టబోతున్న నితీశ్ కుమార్ స్పందించారు. మనం చేసే ప్రతి చర్యకీ ప్రతిచర్య ఉంటుందని, అదే బీజేపీకి ఎదురైందని ఆయన అన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారం కార్పొరేట్ స్థాయిలో సాగిందని అన్నారు. బీజేపీ సామాన్యులను పట్టించుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఫలితాలు కూడా కార్పొరేట్ వర్గానికి మాత్రమే పరిమితమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, బీజేపీ చేసిన ప్రచార విధానంపై ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.