: మీ దీపావళి మా చావుకొచ్చింది...శునకాల ఆత్మఘోష!
మీ దీపావళి పండుగ మా చావుకొచ్చిందని కుక్కలు భావిస్తుంటాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు. దీపావళి సందర్భంగా వారో వీడియో రూపొందించారు. సాధారణంగా కుక్కలకు ఘ్రాణశక్తి, వినికిడి శక్తి విశేషంగా ఉంటుంది. అత్యంత సూక్ష్మమైన శబ్దాన్ని కూడా కుక్కలు వినగలుగుతాయి. అలాంటి కుక్కలకు పటాసుల శబ్దం ఎలా వినిపిస్తుందో ఓసారి ఆలోచించండి... అంటూ బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అనుష్కా శర్మ పేర్కొంటున్నారు. అపార్ట్ మెంట్లలోని వారు చేసే దీపావళి సందడి వాటి పాలిట నరకంగా మారుతుందని వారు సూచిస్తున్నారు. ఘ్రాణశక్తి అమోఘంగా ఉన్న ఆ జంతువులు టపాసుల ద్వారా వెలువడే కాలుష్యానికి ఉపిరిపీల్చుకోలేక తీవ్ర ఇక్కట్లపాలవుతాయని వారు చెబుతున్నారు. టపాసులు పేల్చేటప్పుడు పెంపుడు జంతువులు భయపడితే బలవంతంగా వాటిని దగ్గర ఉంచుకోవద్దని చెబుతున్న నిపుణులు, అలా వాటిని వదిలేయకూడదని కూడా చెబుతున్నారు. వాటిని అనునయించి ప్రేమగా చూడాలని చెబుతున్నారు. కాగా, కుక్కలతో పాటు పక్షులు, కుందేళ్ల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.