: మోదీ, అమిత్ షాలకు గడ్కరీ మద్దతు


ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మద్దతు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బీహార్ ఎన్నికల్లో పరాజయ భారం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా లపై వేయడం సరికాదని అన్నారు. ఓటమికి అంతా సమష్టి బాధ్యత వహించాలని, వారిద్దరినే బాధ్యులను చేయడం పద్ధతి కాదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. గతంలో వాజపేయీ, అద్వానీ హయాంలో కూడా పార్టీ పరాజయం పాలైందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదు కనుక అంతా బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. బీహార్ లో ఓటమికి మోదీ, అమిత్ షా వ్యాఖ్యలే కారణమని ఆ పార్టీ సీనియర్లు ప్రకటించిన నేపథ్యంలో, గడ్కరీ ప్రకటన ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలకు అద్దం పడుతోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News