: ఉల్ఫా నేతను భారత్ కు అప్పగించిన బంగ్లా... షేక్ హసీనాకు థ్యాంక్స్ చెప్పిన మోదీ


ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు ఉద్యమాలు నడిపి కేంద్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉల్ఫా నేత అనూప్ చెతియాను బంగ్లాదేశ్ ఎట్టకేలకు భారత్ కు అప్పగించింది. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగిన చర్చల నేపథ్యంలో నేటి ఉదయం చెతియాను బంగ్లా అధికారులు భారత్ కు అప్పగించారు. దీనిపై వేగంగా స్పందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్ చేశారు. చెతియాను తమకు అప్పగించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడ్డారని హసీనాకు మోదీ థ్యాంక్స్ చెప్పారు. ఈ తరహా సంబంధాలు మున్ముందు కూడా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News