: ఈ దీపావళికీ సరిహద్దులకే వెళుతున్నా!... సైనికులతోనే సంబరాలంటున్న మోదీ


ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలి దీపావళి వేడుకలను భారత సైనికులతో కలిసి జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా ఇండో-పాక్ సరిహద్దు ప్రాంతం సియాచిన్ కు వెళ్లారు. తాజాగా ఈ దీపావళి వేడుకలను కూడా దేశ సరిహద్దుల్లోనే జరుపుకుంటానని మోదీ నేటి ఉదయం ప్రకటించారు. భారత సైనికులతోనే తాను ఈ దీపావళి సంబరాలు జరుపుకుంటానని కూడా ఆయన పేర్కొన్నారు. ‘‘దీపావళి పర్వదినం సందర్భంగా నేడు సరిహద్దులకు వెళుతున్నాను. సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకునేందుకే అక్కడికి వెళుతున్నా’’ అంటూ మోదీ పేర్కొన్నారు. అయితే ఈ దీపావళికి సరిహద్దు ప్రాంతాల్లో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లనున్నారన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు.

  • Loading...

More Telugu News