: జనాన్ని రక్షించేందుకు వెళ్లి వాగులో చిక్కుకున్న ఎస్సై... ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా!


బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం రేవాను తుపానుగా మారి తమిళనాడు, పుదుచ్ఛేరిలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో పంబలేరు వాగు పొంగి పొరలుతోంది. వాగు ప్రవాహంలో పలువురు చిక్కుకున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన గూడూరు రూరల్ ఎస్సై జగన్మోహన్ రావు ముగ్గురు కానిస్టేబుళ్లతో కలిసి అక్కడికి వెళ్లారు. ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షించే క్రమంలో ఎస్సై, తన సిబ్బందితో కలిసి వాగులో చిక్కుబడిపోయారు. పరిస్థితిని గమనించిన స్థానికులు ఎస్సై, పోలీసులను రక్షించేందుకు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News