: చిలీలో భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతగా నమోదు
దక్షిణ అమెరికా తీర ప్రాంత దేశం చిలీలో కొద్దిసేపటి క్రితం పెను భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.9గా నమోదైనట్లు యూఎస్ జియలాజికల్ సర్వే వెల్లడించింది. చిలీలోని కాకింబో నగరానికి వంద కిలో మీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలానికి 10 కిలో మీటర్ల లోతున ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు.