: వెంకన్న సన్నిధిలో 'దీపావళి ఆస్థానం'... ఆర్జిత సేవలు రద్దు
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో దీపావళి ఆస్థానం జరుగుతోంది. నేటి తెల్లవారుజాముననే మొదలైన దీపావళి ఆస్థానం ఉదయం 9 గంటల వరకు ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయంలో నేటి ఉదయం జరగాల్సిన పలు ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రద్దు చేసింది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆలయంలో రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా జరుగుతాయని ఇదివరకే టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.