: అయ్యన్నపాత్రుడికి బుల్లెట్ ప్రూఫ్ కారు... ఇంటి గేటు వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు


టీడీపీ సీనియర్ నేత, ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి భద్రత మరింత పెరిగింది. అయ్యన్న సొంత జిల్లా విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మావోయిస్టుల నుంచి అయ్యన్నకు బెదిరింపు లేఖ వచ్చినట్లు ప్రచారం సాగింది. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మంత్రి పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేయాలని సదరు లేఖలో మావోయిస్టులు అయ్యన్నకు సూచించారని, తమ ఆదేశాలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అయ్యన్నకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత మరింత పెరిగింది. కొత్తగా నిన్న ఆయనకు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అందజేసింది. దీంతో ఇకపై ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణించనున్నారు. ఇక నర్సీపట్నంలోని ఆయన ఇంటి గేటు వద్ద పోలీసులు మెటల్ డిటెక్టర్ ను ఏర్పాటు చేశారు. అయ్యన్నను కలిసేందుకు వస్తున్న ప్రతి ఒక్కరిని మెటల్ డిటెక్టర్ ద్వారా పంపుతున్న పోలీసులు వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక ఇంటి వద్ద కాపలా ఉంటున్న పోలీసుల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచింది.

  • Loading...

More Telugu News