: మోదీకి ఒబామా దీపావళి గ్రీటింగ్స్... స్వయంగా ఫోన్ చేసి చెప్పిన అగ్ర రాజ్యాధిపతి
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొద్దిసేపటి క్రితం స్వయంగా ఫోన్ చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మోదీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్-అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఎప్పుడు కలిసినా ఇరు దేశాధినేతలు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. ఈ క్రమంలో ఒబామా నేరుగా మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. తనకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ఒబామాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.