: వరంగల్ లోని బార్ లో రౌడీల హల్ చల్


వరంగల్ లోని ఓ బార్ లో రౌడీలు హల్ చల్ చేశారు. స్థానికులను భయబ్రాంతులకు గురి చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... వరంగల్ లోని న్యూ డైమండ్ బార్ లో ఎనిమిది మంది రౌడీలు మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది చిలికి చిలికి గాలివానగా మారడంతో వారు స్వైరవిహారం చేశారు. దీంతో అక్కడి ఫర్నిచర్ ధ్వంసమైంది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఎనిమిది మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి హల్ చల్ తో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వీరి ఘర్షణకు కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు దోహదం చేసిన విషయం ఏమై ఉంటుందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News