: పోలీస్ తనిఖీల్లో రూ.42 లక్షల నగదు స్వాధీనం!


వరంగల్ చౌరస్తాలో ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.42 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా ద్విచక్రవాహనంపై వెళుతున్న వారిద్దరిని పోలీసులు ఆపారు. తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు కన్పించింది. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నగదును ఆదాయపు పన్ను శాఖాధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న ఈ నగదు నగరానికి చెందిన ఒక బంగారు వ్యాపారిదని సమాచారం.

  • Loading...

More Telugu News